Saturday, 24 September 2016

Rowdy marriage

అతనికి పెళ్లయి సరిగ్గా పదిరోజులు కూడా గడవలేదు. ఇంటికి వేసిన రంగులు ఇంకా వెలిసిపోనే లేదు. తనతో పాటు ఏడడుగులు నడిచిన భార్యే అతని వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. వారిద్దరికీ జరిగింది అసలు పెళ్లి కాదు దొంగ పెళ్లి అని తెలిసిన ఆ పెళ్లికొడుకు ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. ఇంటి నుంచి పోతూపోతూ ఆ మహిళ తన చేతివాటం ప్రదర్శించింది. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు ఎత్తుకుపోయింది. పోలీసులు విచారణలో ఆమె ఓ ఘరానా దొంగ అని తేలింది. పెళ్లి పేరుతో అమాయకులైన యువకులకు మ్యారేజ్ బ్యూరో ద్వారా దగ్గరై.. వారిని నమ్మించి... ఇంట్లో ఉన్న నగలన్నీ దోచుకెళ్లడమే ఈ మహిళ పని. ఈ మోసాలకు ఆమె అన్నయ్య కూడా సహకరిస్తుండటం కొసమెరుపు. ఈ ఘరానా మోసం గుజరాత్లోని అమరైవాడి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
అహ్మదాబాద్: అసలు విషయానికొస్తే, గుజరాత్లో యోగిత అనే యువతి, ఆమె అన్నయ్య సుధాకర్ బతకడానికి దొంగతనాలనే మార్గంగా ఎంచుకున్నారు. మొదట్లో చిన్నాచితకా దొంగతనాలు చేసిన వీరిద్దరూ రూట్ మార్చారు. త్వరగా జీవితంలో స్థిరపడొచ్చనే దుర్భుద్దితో ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించి తన చెల్లికి మంచి పెళ్లి కొడుకును చూడాలని సుధాకర్ ఫోటోలిచ్చాడు. ఇదే సమయంలో అమర్వాడీలోని ఆదర్శ్ అపార్ట్మెంట్స్కు చెందిన రాజ్పుత్కు పెళ్లి సంబంధాలు చూసే పనిలో అతని అంకుల్ డాక్టర్. రమేష్ రాజ్పుత్ నిమగ్నమయ్యారు. యోగిత ఫోటోను రమేష్ చూశాడు. అమ్మాయి లక్షణంగా ఉందని కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలని మ్యారేజ్ బ్యూరోను అడిగాడు.
రాజ్పుత్ను వెంటపెట్టుకుని రమేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యుల వివరాలు చెప్పాలని పెళ్లికి ముహుర్తం పెట్టుకుందామని రమేష్ కోరాడు. తనకు అన్నయ్య మాత్రమే ఉన్నాడని... అనాథలమని యోగిత చెప్పింది. అమ్మాయి నచ్చడంతో కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా సెప్టెంబర్ 7న పెళ్లి నిశ్చయించుకున్నారు. ఎట్టకేలకు అంగరంగ వైభవంగా రాజ్పుత్కు, యోగితకు పెళ్లి జరిగింది. కానీ పెళ్లయిన 10రోజులకు యోగిత అసలు రంగు బయటపడింది. ఇంట్లో నగలు, లక్ష రూపాయల డబ్బుతో యోగిత ఉడాయించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. యోగిత, తన అన్నయ్య కలిసి 18 నెలల్లో ముగ్గురు యువకులను మోసం చేసినట్టు తేలింది.

No comments:

Post a Comment